కోనసీమ: రావులపాలెంకు చెందిన తాతపూడి సందీప్ వర్మ జాతీయ స్థాయి అండర్-20 ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. మే 19 నుంచి 25 వరకు ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి ఈ ఘనత సాధించిన జిల్లా తొలి ఆటగాడిగా సందీప్ రికార్డు సృష్టించాడు. సందీప్ ఎంపిక పట్ల కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.