E.G: నిరంతరం నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఆరుగురు వ్యక్తులపై రౌడీషీట్లతో పాటు సస్పెక్ట్ షీట్లు నమోదు చేసినట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. నార్త్ జోన్ డీఎస్పీ జీవన్, కోరుకొండ సీఐ మూర్తి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నేర చరిత్ర కలిగి ఉన్న సదరు వ్యక్తుల కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.