SRPT: కోదాడ మండలం కూచిపూడి గ్రామంలోని కాలనీలో నిర్మించిన డ్రైనేజీ కాల్వలను అసంపూర్తిగా వదిలేయడంతో మురికి నీరు నిలిచిపోతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, పురుగులు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల ఓ బాలుడు డ్రైనేజీలో పడిపోయిన ఘటన జరిగినప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు.