సత్యసాయి: పుట్లంపల్లి రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.కిషోర్ తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4 నుంచి 6వ తరగతి విద్యార్థులకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో, 7 నుంచి 9వ తరగతి వారికి రాష్ట్ర స్థాయిలో ఎంపికలు ఉంటాయన్నారు.