దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు గిగ్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ భారం త్వరలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారికి భారంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ‘ఎలారా క్యాపిటల్’ అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, పెరుగుతున్న ఇంధన ధరలే దీనికి ప్రధాన కారణం అని పేర్కొంది.