E.G: గోపాలపురం(M) భీమోలు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా మాజీ హోం మంత్రి, నియోజకవర్గ ఇంఛార్జ్ తానేటి వనిత ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో రు. కోట్లు విలువ చేసే మట్టిని పక్కదారి పట్టిస్తున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మట్టి మాఫియా పెరిగిపోయిందని అన్నారు. అక్రమం మట్టి తవ్వకాలను ఆపకపోతే వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరన్నారు.