NRPT: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ వినీత్ బుధవారం కోస్గి పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించాలని, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు.