SS: గోరంట్ల మండలం మల్లాపల్లి, కల్లగేరి గ్రామాలకు చెందిన అనారోగ్యంతో ఉన్న పలువురు వైసీపీ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పాటూరి శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.