ATP: మంత్రి కొల్లు రవీంద్ర మే 21, 22 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి 21న సాయంత్రం జిల్లాకు చేరుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారు. 22న ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లో గనులు, భూగర్భ శాఖ అధికారులతో, 11 గంటల నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.