E.G: మంత్రి కందుల దుర్గేష్తో ఎమ్మెల్సి సోము వీర్రాజు బుధవారం భేటీ అయ్యారు. నిడదవోలు పార్టీ కార్యాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేయదగిన టూరిజం ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. గోదావరి పరివాహక ప్రాంతం సహజ సిద్ధమైన అందాలతో నిండినప్రదేశం కావడంతో టూరిజం, మెడికల్ టూరిజంపై దృష్టి సారించాలన్నారు.