TPT: ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా తిరుపతిలో వ్యాసరచన పోటీలు ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, వేమన విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో “స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో ఆకాశవాణి పాత్ర” అంశంపై జరిగిన ఈ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.