ADB: నకిలీ సంతకాలతో రూ. 12 లక్షల అక్రమ నగదు బదిలీ కేసులో నిందితులు శ్రీనివాస్, జలీమ్కు జైలు శిక్ష విధించినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితుడు గోవింద్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమంగా నగదు బదిలీ చేసినట్లు రుజువైందని JFCM న్యాయమూర్తి మౌనిక తీర్పును వెల్లడించారు. బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని SP సూచించారు.