AP: పాస్టర్ అభినయ్ దర్శన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే అతడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై గతంలో వరకట్న వేధింపుల కేసు ఉన్నట్లు తెలిపారు. భార్యలను వేధించినట్లు పలు కేసులు నమోదయ్యాయి. CPF పార్టీ పేరుతో విరాళాలు సేకరించినట్లు విచారణలో తేలింది. కాగా, ప్రస్తుతం అభినయ్ పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర చేస్తున్నాడు.