HYD: ఉస్మానియా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ లైబ్రరీ వద్ద కరెంటు సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం కావటంతో ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నామని, ఇలా కరెంట్ సరఫరా నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే, కరెంట్ పునరుద్ధరించాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.