AKP: పాయకరావుపేట ప్రభుత్వ ఐటీఐలో సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె సత్యనారాయణ బుధవారం తెలిపారు. పదవ తరగతి పాసై ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా itiadmissions.ap.gov.in/iti వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. జూలై రెండవ తేదీలోగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలన్నారు.