ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురువారం శెట్టూరు మండలంలో పర్యటించనున్నారు. మ.3 గంటలకు ముచ్చర్లపల్లిలో జరిగే భగీరథ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం సా.4 గంటలకు శెట్టూరులోని దళిత వాడలో నిర్వహించే ప్రజాదర్భార్‌లో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని నేతలు తెలిపారు.