GNTR: తెనాలి శివారు అంగలకుదురులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం వెనుక రోడ్డులో రెండు పూరిల్లకు నిప్పంటుకొని ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. 4 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. మొక్కజొన్న వ్యర్థాలను తగలపెట్టడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. తహసీల్దార్ గోపాలకృష్ణ బాధితులను పరామర్శించారు.