MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేంద్రం ఇంఛార్జి, అధికారులు లంచాలు తీసుకుని, సీరియల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా కాంటా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లారీలు సరిగ్గా రావటం లేదని వాపోయారు. దీని పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.