NLG: ఎండల తీవ్రత దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 524 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు. అయితే ప్రస్తుతం కేవలం 156 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలతో పాటు మెయిన్ పవర్ హౌస్, ఎల్ఎల్సీ ద్వారా నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు.