కడపలో రేపు మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. బుడ్డాయపల్లి మెయిన్ రోడ్డులోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా సాయంత్రం 4:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ ఇంఛార్జ్‌లు, కమిటీ సభ్యులు, ప్రభుత్వ పదవులు పొందిన నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పిలుపునిచ్చారు.