ATP: కూడేరు మండలం మరుట్ల కాలనీలో అసైన్డ్ భూమి సాగు పట్టాల ఎంపిక జాబితా తయారీపై బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూమి సాగు చేస్తున్న ప్రతి నిరుపేదకు పట్టా ఇస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి 47 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు.