SRPT: చింతలపాలెం మండలంలో గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న మఠంపల్లి, హుజూర్నగర్ ప్రాంతాల ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గడ్డపారలు, పారలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్ఐ పి.పరమేష్ నిందితులను తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టగా వారిని బైండోవర్ చేసినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.