KMR: నిజాంసాగర్ మండలం బ్రాహ్మన్ పల్లికి చెందిన సత్యం(36) మద్యానికి బానిసై, అప్పుల బాధతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ బుధవారం తెలిపారు. 16 ఏళ్లుగా అత్తగారింట్లోనే ఇళ్లరికం ఉంటున్న సత్యం ఈ నెల 17న భార్యతో గొడవపడి విషం తాగినట్లు చెప్పారు. NZB ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.