MNCL: బెల్లంపల్లి సహారా ఇండియా కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. తాము కట్టిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి దాడిపోయిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డ్స్ పట్టుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం సహారా సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. డబ్బులు చెల్లించకుంటే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు.