SRPT: ఆత్మకూరు (ఎస్) మండలంలో ఆస్తి కోసం సొంత అక్క అంజమ్మను కత్తితో నరికి చంపిన తమ్ముడు సురభి సైదులు, అతని భార్య, కుమారుడిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, న్యాయవాది భీమయ్య కోసం గాలిస్తున్నామని అన్నారు.