CSKతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న DC బ్యాటింగ్లో తడబడుతోంది. ఓపెనర్లు నిస్సంక (19), రాహుల్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కరుణ్ నాయర్ (13) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అనంతరం నితీష్ రాణా (13) సైతం ఔట్ కావడంతో ఢిల్లీ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.