TG: హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో బాధితులు ఆస్పత్రికి వస్తున్నారని, ఇప్పటి వరకు ఆస్పత్రిలో 15 మందికి చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో 100 బెడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని, ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.