బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గల్ఫ్ యుద్ధంలో చిక్కుకుపోయింది. న్యూయార్క్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న ఆమె విమానం మధ్యలో దుబాయ్‌లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, UAEపై క్షిపణి దాడులు జరగడంతో ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని మస్కట్‌కు మళ్లించారు. ‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి అందరూ నా కోసం ప్రార్థించండి’ అంటూ SMలో పోస్ట్ చేసింది.