ఐసీసీ తాజాగా పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా 275 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (258), న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్ (240), వెస్టిండీస్ (233) నిలిచాయి. ఇక టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ కొనసాగిస్తున్నాడు.