శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దర్శకుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతికను హీరోయిన్గా ఖరారు చేసినట్లు సమాచారం.