రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న చిత్రం ‘తలైవర్ 173’. ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అశ్వత్ మారిముత్తు అందుకున్నాడు. అశ్వత్ చెప్పిన కమర్షియల్ స్క్రిప్ట్‌కు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.