బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్తో ప్రేమలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్లో హ్యూమా- రచిత్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఒక ఫ్రెండ్ పెళ్ళిలో పరిచయం అయిన వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు ప్రేమలో ఉన్నారు.