తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సినిమాకు ఉన్న పవర్ ఇది. అది ప్రజలను కదిలించగలదు.. వ్యవస్థలను గడగడలాడించగలదు. ఒక సామాన్య వ్యక్తి ఉనికిని పవర్‌గా మార్చగలదు. ఎలాంటి ఆర్భాటాలు లేవు. పెద్దగా ప్రచారాలు లేవు.. అయినా విజయం వరించింది’ అని పోస్ట్ పెట్టాడు.