‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మమత తనను బెంగాల్లో అడుగుపెట్టనివ్వనని అన్నారని, తన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్నూ అడ్డుకున్నారని వెల్లడించారు. తన సినిమా ప్రదర్శనను నిలిపివేయడమే కాకుండా, రాష్ట్రంలోకి రాకుండా ఆంక్షలు విధించారని వివేక్ పేర్కొన్నారు.