స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. 2 గంటల 30 నిమిషాల 47 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. మే 14న ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్గా విడుదల కానుంది.