SRD: పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని తోషిబా పరిశ్రమ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు పరిశ్రమ సహకారం కోరారు.