తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ గెలుపొందారు. దీంతో విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా సూపర్‌స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. ‘అద్భుత విజయం సాధించిన విజయ్‌కు శుభాకాంక్షలు. ఈరోజు ప్రజలు మీపై ఉంచిన అపార నమ్మకానికి ఈ విజయం నిదర్శనం. తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నా’ అని మహేష్ ట్వీట్ చేశాడు.