LSGతో మ్యాచ్లో MI స్టార్ ప్లేయర్ రోహిత్ బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రోహిత్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, దీంతో అతడు ఈ మ్యాచ్లో కూడా ఆడటం కష్టమేనని సమాచారం. దీంతో MI అభిమానులకు మరోసారి నిరాశే ఎదురవనున్నట్లు కనిపిస్తోంది. ఈ సీజన్లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన రోహిత్, గాయం కారణంగా ఇప్పటికే 5 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.