ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి 2’ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ ఇవాళ జాయిన్ అయ్యాడట. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ షూట్స్ ఉండబోతున్నాయట. ప్రభాస్ సుమారు వారం రోజుల పాటు ఈ కీలక షెడ్యూల్లో పాల్గొంటారని టాక్.