రష్మిక మందన్నా తన సోదరి సిమ్రాన్ 13వ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ‘నువ్వు టీనేజ్‌లోకి అడుగుపెడుతున్నావు, ఎన్నో నేర్చుకుంటావు. కానీ నీ చిరునవ్వును, అమాయకత్వాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు’ అంటూ అక్కగా విలువైన సలహా ఇచ్చింది. ఈ సందర్భంగా తన చెల్లెలితో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గడిపిన కొన్ని అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.