డీమార్ట్ నిర్వాహక సంస్థ ‘అవెన్యూ సూపర్మార్ట్స్’ గత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి త్రైమాసికంలో రూ. 656.42 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 19.17% అధికం. కంపెనీ ఆదాయం కూడా 18.9% పెరిగి రూ. 17,683 కోట్లకు చేరింది. ఏడాది మొత్తానికి కంపెనీ లాభం రూ. 2,969 కోట్లుగా నమోదై వ్యాపార వృద్ధిని చాటుకుంది.