రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అండర్వాటర్ సీన్స్ కోసం 10 వేల లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు కావాలని హైదరాబాద్ వాటర్ బోర్డుకు చిత్రబృందం షాకింగ్ రిక్వెస్ట్ పెట్టింది. దీంతో నగరంలో నీటి ఎద్దడి దృష్ట్యా బోర్డు నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ జర్మనీలో శిక్షణలో ఉన్నాడు. మే 18 నుంచి ఈ భారీ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది.