ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ధురంధర్’ చిత్రంతో పవర్ ఫుల్ విలన్‌గా మెప్పించిన అక్షయ్, ఇప్పుడు ఈ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.