ప్రేమపై హీరోయిన్ తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జీవితంలో ఎన్నిసార్లయినా ప్రేమలో పడే అవకాశం ఉందని తెలిపింది. అది కేవలం ఒక్కరికే పరిమితం కావాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది. బంధాలు.. ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలని.. అలాంటి బంధం దొరికే వరకూ కొత్త బంధాలను వెతుక్కోవాలని వ్యాఖ్యానించింది. నటుడు విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.