రామ్ చరణ్ 17వ సినిమా దర్శకుడు సుకుమార్‌తో ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకొచ్చింది. ‘పెద్ది’ జూన్‌లో విడుదలైన వెంటనే, ఏమాత్రం గ్యాప్ లేకుండా చరణ్ ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.