NZB: భీమగల్ మండలంలోని పురాణీపేట్ సర్పంచ్ బుర్ర సుమ ఆమె భర్త దేవేందర్ గౌడ్ గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన, అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.