అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైన రస్టీ డాగర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 16 నెలల్లోనే తయారైన ఈ క్షిపణి 920 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఇలాంటి 3,000 క్షిపణులను అమెరికా పంపనుంది. ఈ క్షిపణులు యుద్ధ రంగంలో ఉక్రెయిన్ బలాన్ని భారీగా పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు.