మహిళా రోయింగ్ కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఓ ఒలింపియన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆసియా గేమ్స్ పతక విజేత రోయర్ పీటీ పౌలోస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు జనవరిలో మహిళా అసిస్టెంట్ రోయింగ్ కోచ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం పీటీ పౌలోస్ను శాయ్ సస్పెండ్ చేసింది.