ప్రకాశం: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలను గుర్తుంచుకుంటుందని కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. గురువారం హనుమంతుని పాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ని కలిసి గ్రామ కమిటీ నియామకాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కొండపురెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణ, సల్మాన్ రాజు పాల్గొన్నారు.