JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.2,32,764 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.1.06 లక్షలు, ప్రసాదాల ద్వారా రూ.1.02 లక్షలు, అన్నదానం ద్వారా రూ.24 వేల ఆదాయం లభించింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.